





ఎపఫ్రా మినిస్ట్రీస్ ప్రయాణం
A Life of Example — The Journey of Epaphras Ministries
బ్రదర్ ఎపఫ్రా గారు 1998 లో ఇద్దరికి క్రీస్తు ప్రేమను బోధించుట ప్రారంభించి, దైవ చిత్తానుసారముగా 2004 లో ఎపఫ్రా మినిస్ట్రీస్ ను స్థాపించారు. హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో నిర్వహిస్తున్న ఆరాధనలు, సువార్త సభల ద్వారా అన్యులు, నామకార్ధపు అనుభవములలో ఉన్నవారిని దేవుని రాజ్యము కొరకు సిద్దపరుస్తున్నారు.
క్రీస్తు గురించి బోధించుట మాత్రమే కాదు గాని, బోధించిన దాని ప్రకారం జీవించడం ద్వారా అనేకులను క్రీస్తు వైపు ఆకర్షించవచ్చని నమ్ముతూ, ఈ భూమి మీద మన జీవితాన్ని ప్రభువుకు సమర్పించి ఆదర్శప్రాయంగా జీవించమని ప్రోత్సహిస్తున్నారు.
ఈ పరిచర్యలో ప్రకటిస్తున్న బోధలు విని అనేకులు తమ దుర్వ్యసనములను, పాపపు మార్గములను విడిచిపెట్టి క్రీస్తు కొరకు జీవించాలనే తపన కలిగి ఉన్నారు. వీరిలో అనేకులు తమ సమయమును, ధనమును వెచ్చిస్తూ పరిచర్యలో పాలుపంచుకుంటున్నారు. వీరు ఐక్యతతో, ప్రేమతో ఒకరికొకరు సహకరించి, ప్రాణమును కూడా లెక్క చేయక దేవుని పరిచర్య కొనసాగించాలనే తపన కలిగి ఉన్నారు.
Brother Epaphras began teaching the love of Christ to two individuals in 1998. According to God's will, in 2004, he established Epaphra Ministries. Through worship services and gospel meetings held around Hyderabad, they prepare unbelievers and nominal Christians for the Kingdom of God.
His mission is not just to teach about Christ, but to live according to his teaching, believing that a life surrendered to the Lord and lived as an example can attract many toward Christ.
Many who hear these teachings have left behind addictions and sinful ways, longing to live for Christ. Some consider the ministry their own, investing time and resources. They work in unity and love, supporting one another, even willing to risk their lives to continue God's work.
Worship Places & Prayers

Pedda Amberpet

Bhagyalatha

Chinthal
